![]() |
![]() |

తెలుగు సినిమా తొలి గూఢచారి సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణే. ఈతరం ప్రేక్షకులకు అయితే గూఢచారి అంటే యుంగ్ హీరో అడివి శేష్ గుర్తొస్తాడు. ఆ టైటిల్‌తో అతడు చేసిన సినిమా మంచి విజయం సాధించింది. ఈ మధ్య కాలంలో యాక్షన్, థ్రిల్లర్ సినిమాలకు అడివి శేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు.
'గూఢచారి' ఒక్కటే కాదు... స్లో హీరోగా శేష్ నటించిన 'క్షణం', 'ఎవరు' థ్రిల్లర్ జానర్ సినిమాలే. ప్రేక్షకులకు ఆ సినిమాలు నచ్చాయి. అయితే. హ్యాండ్సమ్‌గా ఉండే అతడు ప్రేమకథలో నటిస్తే చూడాలనేది కొందరి అభిమానుల కోరిక. అడివి శేష్ కూడా భవిష్యత్తులో ప్రేమకథలో నటిస్తానని చెబుతున్నాడు. ఓ గాఢమైన ప్రేమకథలో నటించాలని ఉందని తన మనసులో కోరికను ఆయన బయటపెట్టారు. హారర్ సినిమాల్లో అసలు నటించనని శేష్ అంటున్నారు. ఆయనకు హారర్ సినిమాలు నచ్చవట.
ప్రస్తుతం ముంబై ఉగ్రదాడిలో ఎంతోమంది ప్రాణాలు కాపాడి అమరుడైన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'మేజర్'లో అడివి శేష్ నటిస్తున్నారు. తరవాత 'గూఢచారి' సీక్వెల్ చేయనున్నారు. ఆ సినిమా స్క్రిప్ట్ వర్కులో ఉందట.
![]() |
![]() |