![]() |
![]() |

ఓ పక్క స్ట్రయిట్ సినిమాలు తీస్తూ... మరోపక్క కంటిన్యూగా కొరియన్ సినిమాలు రీమేక్ చేయాలని సురేష్ ప్రొడక్షన్స్ డిసైడ్ అయినట్టు ఉంది. సమంత ప్రధాన పాత్రలో ఆ సంస్థ నిర్మించిన సినిమా 'ఓ బేబీ'. అది ఓ కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి రీమేక్. ప్రస్తుతం మరో రెండు కొరియన్ రీమేకులు సురేష్ ప్రొడక్షన్స్‌లో అండర్ ప్రొడక్షన్‌లో ఉన్నాయి.
'స్వామి రారా', 'రణరంగం' ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో కొరియన్ సినిమా మిడ్ నైట్ రన్నర్స్'ను సురేష్ ప్రొడక్షన్స్ రీమేక్ చేయనుందనే సంగతి తెలిసిందే. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... మరో కొరియన్ సినిమా 'డ్యాన్సింగ్ క్వీన్'ను రీమేక్ చేయనుంది. దీని దర్శకత్వ బాధ్యతలను శ్రీవాస్ చేతిలో పెట్టారట. నందమూరి బాలకృష్ణ 'డిక్టేటర్', బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'సాక్ష్యం', గోపీచంద్ 'లక్ష్యం', 'లౌక్యం' సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. 'సాక్ష్యం' తరవాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారట. సురేష్ బాబు, సునీత తాటి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నారు.
![]() |
![]() |