![]() |
![]() |

సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఏ ముహూర్తాన వంశీ పైడిపల్లి కథను 'నో' చెప్పారో? అప్పటినుండి ఆ దర్శకుడు మిగతా హీరోల చుట్టూ చక్కర్లు కొడుతున్నారని వార్తలు వస్తున్నాయి. అతడి కథను మహేష్ పక్కన పెట్టి మరో సినిమాకి ఓకే చెప్పడంతో రామ్ చరణ్ దగ్గరకు వెళ్లారని వినిపించింది. తరవాత మరో స్టార్ హీరో దగ్గరకు వెళితే అక్కడ కూడా మొండిచేయి ఎదురైందట. దాంతో ఇప్పుడు అఖిల్ దగ్గరకు వచ్చి ఆగారని లేటెస్ట్ ఫిలింనగర్ టాక్.
అఖిల్ తండ్రి నాగార్జునతో వంశీ పైడిపల్లి 'ఊపిరి' చేశారు. ఆ సినిమా తరవాత అఖిల్, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో సినిమా అని వార్తలు వినిపించాయి. కానీ, ఖరారు కాలేదు. లేటెస్టుగా మరోసారి ఈ కాంబినేషన్ న్యూస్ తెరపైకి వచ్చింది. మహేష్, చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల దగ్గర వెంటనే సినిమా చేసే అవకాశాలు రాకపోవడంతో వంశీ పైడిపల్లి, అక్కినేని ఇంటి తలుపు తట్టారట. ప్రస్తుతం డిస్కషన్లు జరుగుతున్నాయట.
ప్రస్తుతం 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో అఖిల్ నటిస్తున్నారు. దాని తరవాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారని సమాచారం. వంశీ పైడిపల్లి కథ ఓకే అయితే సురేందర్ రెడ్డి సినిమా తరవాత అతడి ఉండొచ్చు.
![]() |
![]() |