![]() |
![]() |

రీసెంట్‌గా లావణ్యా త్రిపాఠి డెహ్రాడూన్ వెళ్ళింది. ఆల్మోస్ట్ ఆరు నెలలు తల్లితండ్రులకు దూరంగా హైదరాబాద్ సిటీలో ఉందామె. లాక్‌డౌన్‌లో షూటింగులు లేవు. కానీ, ప్రయాణ సౌకర్యాలు లేక డెహ్రాడూన్‌లోని ఇంటికి వెళ్లలేకపోయింది. అన్‌లాక్‌లో ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్ళింది. ఫ్లైట్ జర్నీలో తనకు బ్రీతింగ్ సమస్యలు ఎదురయ్యాయని లావణ్యా త్రిపాఠి తెలిపింది.
"పీపీఈ కిట్ వేసుకుని ట్రావెల్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అదొక వింత అనుభవం. పీపీఈ కిట్ వేసుకున్నామని ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోవడం అడ్వాంటేజ్. అయితే, నాకు కొన్ని బ్రీతింగ్ సమస్యలు ఎదురయ్యాయి. మాస్కు ధరించా. పైన, పీపీఈ కిట్. వీటికి తోడు ఆకాశంలో అంత ఎత్తున రెండున్నర గంటలు ప్రయాణం చేయడం వల్ల గాలి ఆడలేదు" అని లావణ్యా త్రిపాఠి తెలిపింది.
ఇంటికి వెళ్ళినా అందరితో షేక్ హ్యాండ్ ఇవ్వడం, హగ్ చేసుకోవడం వంటివి చేయడం లేదట. భౌతిక దూరం పాటిస్తున్నానని లావణ్యా త్రిపాఠి చెప్పుకొచ్చింది. అయితే, అందరినీ నేరుగా చూడటం... అమ్మ చేతి వంట తినడం ఆనందంగా ఉందని ఆమె వివరించింది.
![]() |
![]() |