![]() |
![]() |

ఇతర జీవులపై ఆధారపడే జీవి 'పరాన్నజీవి' కాబట్టి, రామ్‌గోపాల్ వర్మను పరాన్న జీవిగా పోలుస్తూ పవన్ కల్యాణ్ అభిమానులు ఆ పేరుతో సినిమా చేస్తున్నారు. ఇంగ్లీష్ అక్షరాల్లో ఆర్.. జీ.. వీ..ని వేరు చేసి ఆర్ అంటే రెక్‌లెస్, జీ అంటే జెనెటిక్, వీ అంటే వైరస్ అనే అర్థం జోడించారు. అంటే ఆర్జీవీని వారు రెక్‌లెస్ జెనెటిక్ వైరస్‌ని చేసేశారు.అలాగే 'డేరా బాబా', 'పార్న్‌జీవి', 'ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ టాలీవుడ్: ఫ‌్లాప్ డైరెక్టర్', 'ఆర్‌జీవీ: రోజూ గిల్లే వాడు' అనే సినిమాలు, వెబ్ సిరీస్ కూడా తయారవుతున్నాయి. అయితే ఆర్జీవీ ఇలాంటి నెగటివిటీని తనకు ఆశీర్వాదాలుగా భావిస్తాడు కాబట్టి.. ఇప్పుడూ అదే పని చేస్తున్నాడు. డైరెక్టర్‌గా ఎప్పుడో తనలోని ప్రతిభను పాతరేసుకున్నాడు కాబట్టి, కాంట్రవర్సీ స్టోరీలతో, కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్‌తో చట్టానికి దొరక్కుండా సినిమాలు తీస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు.
తనపై 'పవర్ స్టార్' అంటూ పేరడీ మూవీని ఆర్జీవీ తీసినా పవన్ కల్యాణ్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పట్టించుకుంటే.. అది ఆర్జీవీకే ప్లస్ అవుతుందనీ, 'పవర్ స్టార్' మూవీకి మరింత ఉచిత పబ్లిసిటీ లభించి, ఆర్జీవీ మరింత లాభపడతాడనీ ఆయనకు తెలుసు కాబట్టి తనకేం పట్టనట్లు ఉంటున్నారు. కానీ ఫ్యాన్స్ అలా కాదు కదా. తమ హీరోకు సంబంధించిన ఎలాంటి నెగటివిటీనీ వాళ్లు తట్టుకోలేరు. ఈ విషయాల్లో తమ హీరో క్షమించినా వాళ్లు మాత్రం క్షమించరు. అందుకే వరుసపెట్టి ఆర్జీవీపై సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. వీటితో ఆర్జీవీని బద్నామ్ చేస్తున్నామని వాళ్లనుకుంటున్నారు. కానీ వాటిని తనకు దీవెనలుగా ఆర్జీవీ భావిస్తున్నాడనీ, తనపై సినిమాలు తీయడాన్ని ఆయన మరింతగా ఎంజాయ్ చేస్తున్నాడనీ పవన్ ఫ్యాన్స్ అర్థం చేసుకున్నట్లు లేదు.
తనపై పవన్ ఫ్యాన్స్ తీసే సినిమాలు జనం చూడరని ఆర్జీవీకి తెలుసు. తద్వారా నష్టపోయేది ఆ సినిమాలు తీసేవాళ్లే కానీ తను కాదనీ ఆయనకు తెలుసు. అందుకే పవర్ స్టార్ సినిమాకు వస్తున్న అమేజింగ్ ఫ్రీ పబ్లిసిటీతో మరింతగా జనం నుంచి డబ్బు దండుకోబోతున్నానని ఆయన సంబరపడుతున్నాడు.
![]() |
![]() |