![]() |
![]() |
.jpg)
హీరో నితిన్ జూలై 26న తన స్నేహితురాలు షాలినిని వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. కాగా శుక్రవారం తన నివాసంలో నితిన్ పెళ్లికొడుకు వేడుక జరుపుకున్నాడు. ఈ వేడుకకు పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హాజరయ్యారు. వారితో పాటు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ కూడా పాల్గొన్నారు. తన అభిమాన హీరో రాకతో నితిన్ ఆనంద పరవశుడయ్యాడు.
పవన్‌కు నితిన్ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. అలాగే నితిన్ అంటే కూడా పవన్ వాత్సల్యం చూపిస్తుంటారు. పవన్ రూపం కొత్తగా ఆశ్చర్యపరిచేలా ఉంది. సంప్రదాయ పంచె, లాల్చీ, ఛాతీపై కప్పిన శాలువాతో రుషి తరహాలో ఆయన కనిపించారు.
ఈ నెల 26న ఫలక్‌నుమా ప్యాలెస్‌లో రాత్రి 8:30 గంటలకు షాలిని మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు నితిన్. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ వేడుకను నిర్వహించేందుకు రెండు కుటుంబాలూ అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాయి.


![]() |
![]() |