![]() |
![]() |

‘బిచ్చగాడు’ చిత్రంతో తమిళంలోనే కాదు..తెలుగులోనూ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు విజయ్ ఆంథోని . 2016 విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. తాజాగా జాతీయ అవార్డు గ్రహీత ప్రియ కృష్ణస్వామి దర్శకత్వంలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్‌గా, మరోవైపు హీరోగా రాణిస్తోన్న విజయ్ ఆంటోని పుట్టినరోజు జూలై 24. ఈ సందర్భంగా తెలుగు, తమిళ భాషలలో 'బిచ్చగాడు 2' ఫస్ట్ లుక్, టైటిల్ లోగోను విడుదలచేసింది చిత్ర బృందం. వేలాది మంది ప్రజా సమూహం ముందు స్టేజిపై విజయ్ ఆంథోని వీపు చూపిస్తూ నిల్చొని ఉన్న ఈ లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.
విజయ్ ఆంటోని విభిన్నమైన చిత్రాలతో అటు తమిళం, ఇటు తెలుగులో హీరోగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ‘నకిలీ’, ‘డాక్టర్ సలీమ్’ చిత్రాలతో అప్పటికే తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విజయ్. ఆ తర్వాత భేతాళుడు, యముడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్ వంటి వరుస సూపర్‌హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు జాతీయ అవార్డు గ్రహీత ప్రియ కృష్ణస్వామి దర్శకత్వంలో రూపొందుతోన్న 'బిచ్చగాడు 2'తో మరో సెన్సేషన్ కి సిద్దమవుతున్నారు విజయ్ ఆంథోని.

![]() |
![]() |