![]() |
![]() |

'పలాస' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కరుణకుమార్, 'ఆహా' ఓటీటీ కోసం ఒక వెబ్ సిరీస్ తీశారు. జస్ట్... 14 రోజుల్లో షూటింగ్ అంతా కంప్లీట్ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు పాటిస్తూ, నటీనటులు సహా సాంకేతిక బృందమంతా షూటింగ్ చేశామని దర్శకుడు తెలిపారు.
మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన 'మెట్రో స్టోరీస్' ఆధారంగా కరుణకుమార్ ఈ వెబ్ సిరీస్ చేశారు. ఇందులో నాలుగు కథలు ఉంటాయి. మొత్తం పది పాత్రల చుట్టూ ఆ కథలు తిరుగుతాయి. వాటిలో సమాజంలో సగటు మనిషి జీవితం కనిపిస్తుందని దర్శకుడు అన్నారు. సుమారు 80 నిమిషాల నిడివితో తెరకెక్కించారని తెలిసింది.
రాజీవ్ కనకాల, గాయత్రీ భార్గవి, సన, అలీ రెజా, నందినీ రాయ్, నక్షత్ర, తిరువీర్, రామ్ మద్దుకూరి తదితరులు నటించిన 'మెట్రో స్టోరీస్' వెబ్ సిరీస్ త్వరలో 'ఆహా' ఓటీటీలో విడుదల కానుంది.
![]() |
![]() |