![]() |
![]() |

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. గతంలో పవన్‌తో ‘ఖుషీ’ వంటి సూపర్ డూపర్ క్లాసికల్ హిట్ సినిమా తీసిన నిర్మాత ఏయం రత్నం, కొంత విరామం తర్వాత తెలుగులో నిర్మిస్తున్న చిత్రమిది. పీరియడ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాబిన్ హుడ్ టైప్ క్యారెక్టర్‌లో పవన్ కనిపించనున్నారు. బ్రిటీష్ దొరలతో పాటు భూస్వాములను దోచుకుని పేదలకు పెట్టే పాత్ర హీరోది అని టాక్. హీరోయిజమ్ ఎలివేట్ అయ్యేలా హీరోకి ‘వీర’ అని పేరు పెట్టారట.
తన ప్రతి సినిమాలో తెలుగుకు క్రిష్ జాగర్లమూడి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. చరిత్రకు ప్రాముఖ్యం ఇస్తూ సన్నివేశాలు రూపొందిస్తారు. ఈ సినిమాలోనూ అటువంటి సన్నివేశాలు ఉన్నాయట. పవన్ హీరోయిజమ్ ఎలివేట్ చేసేలా సాయి మాధవ్ బుర్రా డైలాగులు రాస్తున్నారట. అదీ సంగతి. షూటింగ్స్‌కు అనువైన వాతావరణ ఏర్పడిన తరవాత హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో మళ్లీ వర్క్ మొదలు కానుందని టాక్.
![]() |
![]() |