![]() |
![]() |

తెలుగులో 'దొంగ పోలీస్' సినిమాలో మోహన్‌బాబు జోడీగా నటించిన మమతా కులకర్ణి జీవితం ఆధారంగా సినిమాని నిర్మించేందుకు బాలీవుడ్‌లో సన్నాహాలు జరుగుతున్నాయి. బిలాల్ సిద్దిఖీ రాసిన 'ద స్టార్‌డస్ట్ అఫైర్' బుక్ సినిమా హక్కుల్ని నటుడు-నిర్మాత నిఖిల్ ద్వివేది కొనుగోలు చేశాడు. ఆ పుస్తకం మమత జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా రాసింది కావడం గమనార్హం. 1990 దశాబ్దంలో బాలీవుడ్‌లో గ్లామరస్ హీరోయిన్‌గా రాణించింది మమత. స్కిన్ షోతో అలరించి యూత్ ఆరాధ్య తారగా మారింది. వఖ్త్ హమారా హై, ఆషిఖ్ ఆవారా, క్రాంతివీర్, బాజీ, సబ్‌సే బడా కిలాడీ, కిస్మత్, ఘాతక్, చైనా గేట్ వంటి సినిమాలు ఆమెను స్టార్‌ను చేశాయి.
డ్రగ్ రాకెట్‌లో చిక్కుకోవడం, ఇతర వివాదాస్పద సంబంధాలు ఒక సినిమాకు కావాల్సిన మసాలాలు ఆమె జీవితంలో ఉన్నాయని 'ద స్టార్‌డస్ట్ అఫైర్' పుస్తకం చదివితే తెలుస్తుంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గాళ్‌ఫ్రెండ్‌గా గాడ్‌మదర్ హోదాను కొంతకాలం ఆమె అనుభవించిందనే ప్రచారం ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి నిఖిల్ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
బాలీవుడ్ నుంచి పూర్తిగా కనుమరుగైన ఆమె, ఆ తర్వాత కెన్యాలోని నైరోబీలో సెటిల్ అయ్యింది. ఆధ్మాత్మిక జీవితాన్ని గడుపుతూ వచ్చింది. అయితే కొన్నాళ్లకు మరోసారి ఆమె పేరు వార్తల్లో కెక్కింది. బయటపడ్డ ఒక డ్రగ్ రాకెట్‌లో ఆమె భర్త విక్రమ్ గోస్వామి ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటినీ మనం ఈ బయోపిక్‌లో చూసే అవకాశం ఉంది. అయితే మమతా కులకర్ణి క్యారెక్టర్‌ను ఎవరు పోషించనున్నారనేది ఆసక్తికరం.
![]() |
![]() |