![]() |
![]() |

వివాదాస్పద అంశాలను కథా వస్తువులుగా ఎంపిక చేసుకుంటూ రామ్‌గోపాల్ వర్మ వరుసపెట్టి సినిమాలు తీస్తున్నారు. ఓటీటీ, డిజిటల్ మీడియా ఫ్లాట్‌ఫార్మ్ శ్రేయాస్ ఈటీ ఏటీటీలో విడుదల చేయడానికి ఆయన తీసే సినిమాలు లిమిట్స్ క్రాస్ చేస్తున్నాయనే కంప్లయింట్ ఉంది. ఎవరు ఏమి అనుకున్నా నా ఇష్టం అనుకునే వర్మ ఏమాత్రం తగ్గడం లేదు. మహిళల అంగాంగ ప్రదర్శనతో మినీ మూవీస్ 'క్లైమాక్స్', 'నగ్నం' తీసిన విడుదల చేసి సొమ్ములు చేసుకున్న వర్మ, ఇప్పుడు పవన్‌కల్యాణ్ మీద పడ్డారు. ‘పవర్‌స్టార్’ అంటూ హంగామా చేస్తున్నారు. పవన్ తర్వాత వర్మ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ అని గుసగుస.
పదిహేను సంవత్సరాల క్రితం ఘటనను తీసుకుని బాలకృష్ణను ఇరుకునపెట్టే విధంగా వర్మ ఒక సినిమా తీయాలని అనుకుంటున్నారట. కాంట్రవర్సీ చేసే ఉద్దేశంతోనే ఆయన సినిమా ప్లాన్ చేశారట. ప్రతి కథకు తనదైన ఊహాగానాలు జోడించి ఏదో ఒకటి తీసే వర్మ, ఈ సినిమానూ అలాగే తీస్తారట. ఆల్రెడీ వర్మ మీద మెగా ఫ్యాన్స్ కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఇప్పుడు నందమూరి అభిమానులు కూడా గట్టిగా వార్నింగులు ఇస్తారని ఊహించవచ్చు.
![]() |
![]() |