![]() |
![]() |

దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూపర్ హిట్ సినిమాలలో ‘చిచ్చోరే’ ఒకటి. ఆ సినిమా వల్ల సోనమ్ కపూర్, దుల్కర్ సల్మాన్ నటించిన ‘ద జోయా ఫ్యాక్టర్’ ఫ్లాప్ అయిందట. ఈ మాట అన్నది ఎవరో కాదు... ‘జోయా ఫ్యాక్టర్’ దర్శకుడు అభిషేక్ శర్మ. సుశాంత్ సూసైడ్ తరవాత బాలీవుడ్‌లో నెపోటిజమ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. సుశాంత్‌ను తొక్కేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ట్యాలెంట్ లేకపోయినా స్టార్ కిడ్స్‌కి ఛాన్సులు వస్తున్నాయని విమర్శించిన వాళ్ళూ ఉన్నారు. అందులో భాగంగా సోనమ్ కపూర్ మీద చాలా సెటైర్స్ పడ్డాయి. ట్రెండ్‌కి రివర్స్‌లో సుశాంత్ సినిమా వల్ల సోనమ్ సినిమా ఫ్లాప్ అయ్యిందని దర్శకుడు అభిషేక్ శర్మ కామెంట్ చేయడం గమనార్హం.
‘‘ఆల్రెడీ హిట్ అయిన రెండు సినిమాలు థియేటర్లలో ఉండటం వల్ల ‘ది జోయా ఫ్యాక్టర్’ బాక్సాఫీస్ దగ్గర బాగా ఆడలేదు. మా సినిమా కంటే సుశాంత్ సింగ్ ‘చిచ్చోరే’, ఆయుష్మాన్ ఖురానా ‘డ్రీమ్ గర్ల్’ సినిమాలు వారం ముందు రిలీజ్ అయ్యాయి. రెండూ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. థియేటర్లలో ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో ఆడియన్స్‌కి మా సినిమా ఛాయిస్ కాలేదు. ‘ది జోయా ఫ్యాక్టర్’ చూడటానికి డబ్బులు ఖర్చు పెట్టలేదు. రెండు కాకుండా ఒక సినిమా మాత్రమే రిలీజ్ అయి ఉంటే మా కలెక్షన్స్ బాగుండేవి’’ అని అభిషేక్ శర్మ అన్నారు.

![]() |
![]() |