![]() |
![]() |
.jpg)
లాక్‌డౌన్‌లో ఇళ్లకు పరిమితమైన ప్రజలు అందరూ వెయిట్ పెరుగుతున్నారు. వెయిట్ గెయిన్ మీద ఫన్నీ మీమ్స్ కూడా వచ్చాయి. అయితే, లాక్‌డౌన్‌లో వెయిట్ లాస్ అవుతున్నవారు కూడా ఉన్నారు. అందులో యంగ్ హీరో సందీప్ కిషన్ ఉన్నాడు. ఇప్పటివరకు ఇతగాడు 12 కిలోలు తగ్గాడు. ఇంకా తగ్గుతానని చెబుతున్నాడు. ఆల్రెడీ సందీప్ కిషన్ లీన్ లుక్ ఫొటోలు బయటకొచ్చాయి. సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నట్టు క్లియర్ కట్‌గా తెలుస్తోంది. ఇంతకీ, సందీప్ ఎందుకు వెయిట్ తగ్గుతున్నాడో తెలుసా? 'ఏ1 ఎక్స్‌ప్రెస్' కోసం!
హాకీ నేపథ్యంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న సినిమా 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. ఈ స్పోర్ట్స్ బేస్డ్ సినిమా క్లైమాక్స్ కోసం వెయిట్ లాస్ అవుతున్నాడు. ఫిట్ అండ్ పర్ఫెక్ట్ లుక్‌లో కనిపించి ఆడియన్స్‌కి మెస్మరైజ్ చేస్తాడట. ఈ సినిమాలో లావణ్యా త్రిపాఠీ హీరోయిన్. ఈ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. జస్ట్ 16 డేస్ షూట్ చేస్తే షూటింగ్ అంతా కంప్లీట్ అవుతుందట.
వెయిట్ తగ్గిన సినిమా జనాల్లో ముఖ్యంగా లేడీ కమెడియన్ విద్యుల్లేఖ గురించి చెప్పుకోవాలి. ఎంత బరువు తగ్గిందో చెప్పలేదు కానీ, ప్రజెంట్ 68 కిలోలు ఉన్నానని ఈమధ్య చెప్పుకొచ్చింది. వెయిట్ తగ్గిన తరవాత తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
![]() |
![]() |