![]() |
![]() |

ప్రణయ్ పరువు హత్య నేపథ్యంలో తండ్రీ కూతుళ్ళు మారుతీ రావు అమృత కథ ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'మర్డర్' చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన శిష్యులలో ఒకరైన ఆనంద చంద్ర అ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ప్రచారం విషయంలో అంతా తానై వర్మ సినిమాను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ సినిమాకు తన జీవితానికి ఎటువంటి సంబంధం లేదని అమృత ప్రకటించింది. అయితే, ఆమె ప్రకటన కంటే ముందు సోషల్ మీడియాలో అమృత పేరుతో ఒక ఫేక్ పోస్ట్ చక్కర్లు కొట్టింది.
సోషల్ మీడియా పోస్టులో పబ్లిసిటీ కోసం వర్మ తన ఫొటోలు ఉపయోగించినందుకు ఆశ్చర్యపోవడం లేదనీ, తన కుమారుడి ఫొటోలు ఉపయోగించినా ఆశ్చర్యపోనని అమృత రాసినట్టు ఎవరో రాశారు. ఇప్పుడు నిజంగానే అమృత కుమారుడిని వర్మ సీన్ లోకి తీసుకొచ్చారు.
'మర్డర్' సినిమా నుండి తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో ఏడుస్తున్న కుమారుని ఎత్తుకొని కన్నీరు పెడుతున్న అమృత పాత్రధారి సాహితీ అవంచ ఫోటోను వర్మ విడుదల చేశారు. ప్రణయ్ హత్య మాత్రమే కాదు... కుమారుడు జన్మించిన తర్వాత అమృత అనుభవించిన మనోవేదనను తెరపైకి తీసుకొస్తున్నట్లు పరోక్షంగా వెల్లడించారు వర్మ.
![]() |
![]() |