![]() |
![]() |

నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త బండ్ల గణేష్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తనకు కొవిడ్19 సోకిన సంగతి తెలియగానే ఫామ్‌హౌస్‌కి వెళ్లిపోయారు. అక్కడ క్వారంటైన్‌లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తనకు ఈ కరోనా గొప్ప పాఠం నేర్పిందని బండ్ల గణేష్ అన్నారు.
"సంపాదన, పేరు శాశ్వతం కాదు. ఆరోగ్యమే అన్నిటికంటే ముఖ్యమైనదని నేను తెలుసుకున్నాను. ప్రస్తుతం నా లైఫ్ స్టయిల్ మొత్తం మారింది" అని బండ్ల గణేష్ చెప్పారు. అలాగే, నెగెటివిటీకి దూరంగా ఉండటం ఎంత ముఖ్యమో తెలుసుకున్నానని ఆయన అన్నారు. ఇంటికి పరిమితమైన ఆయన ఎక్కువ సమయం సంగీతం వింటున్నానని చెప్పుకొచ్చారు. మెడిటేషన్ కూడా చేస్తున్నారట. అతి త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో కరోనా నుండి బయటపడి వస్తానని బండ్ల గణేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.
![]() |
![]() |