![]() |
![]() |

తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన పూర్ణను బ్లాక్‌మెయిల్ చేయడం ద్వారా డబ్బులు గుంజాలని ప్రయత్నించిన అభియోగంపై నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కొచ్చి (కేరళ)లో మరదు పోలీస్ స్టేషన్‌లో పూర్ణ ఫ్యామిలీ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆ నలుగురు ఒక పెళ్లి బృందంగా ఆ కుటుంబానికి పరిచయమయ్యారు. తాము పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చామంటూ, ఆ నలుగురూ పెళ్లికొడుకు ఫొటో అంటూ ఒక టిక్‌టాక్ మోడల్ ఫొటోను చూపించారు. ఆ తర్వాత వాళ్లు పూర్ణను రూ. లక్ష ఇవ్వమంటూ డిమాండ్ చేశారు. లేకపోతే ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బహిర్గతం చేసి, ఆమె కెరీర్‌ను నాశనం చేస్తామంటూ బెదిరించారు.
ఆ గ్యాంగ్‌లో ఒకడు షామ్నాకాశిమ్ (పూర్ణ అసలు పేరు) ఫోన్ నంబర్ సంపాదించి, అన్వర్ అలీ ఫేక్ నేమ్‌తో తనను తాను పరిచయం చేసుకున్నాడు. తాను కోజికోడ్‌కు చెందిన నగల వ్యాపారిననీ, దుబాయ్‌లో వ్యాపారం చేస్తున్నాననీ చెప్పాడు. ఆ ఇద్దరూ ఫోన్ ద్వారానే సన్నిహితమై, కొద్ది నిమిషాల సేపు మాట్లాడుకున్నారు అని ఒక పోలీస్ ఆఫీసర్ తెలిపారు.
ఆ తర్వాత తాము అన్వర్ ఫ్యామిలీ మెంబర్స్‌మి అంటూ ఆరుగురు వ్యక్తులు కొచ్చిలోని పూర్ణ ఇంటికి వచ్చారు. వాళ్ల ధోరణి చూసి అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు సీసీటీవీ విజువల్స్ చూడగా, ఆ వ్యక్తులు బయట నుంచి స్మార్ట్ ఫోన్ ద్వారా తమ ఇంటినీ, పరిసరాల్నీ, పూర్ణ కారునీ వీడియో తీసినట్లు బయటపడింది. దీని గురించి అన్వర్‌ను పూర్ణ ప్రశ్నించింది. అతను డబ్బు ఇవ్వాల్సిందిగా బెదిరించాడు. దాంతో పూర్ణ కుటుంబం ఆ గ్యాంగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మొదట మలయాళం చిత్రాల్లో నటించిన పూర్ణ తెలుగులో 'శ్రీమహాలక్ష్మి' చిత్రంలో శ్రీహరి చెల్లెలిగా నటించడం ద్వారా పరిచయమైంది. ఆ తర్వా సీమటపాకాయ్, అవును, లడ్డుబాబు, నువ్వలా నేనిలా, అవును 2, మామ మంచు అల్లుడు కంచు, రాజుగారి గది, జయమ్ము నిశ్చయమ్మురా, సిల్లీ ఫెలోస్ తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది.
![]() |
![]() |