![]() |
![]() |

'ఆలు లేదు. చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం' అని సామెత చెప్పినట్టు... సమంతకు ఇంకా గర్భవతి కాలేదు, ఆమెకు పిల్లలు పుట్టలేదు. మరి, కొడుకు ఎక్కడి నుండి వచ్చాడని ఆశ్చర్యపోతున్నారా? అక్కినేని నాగచైతన్య, సమంత దంపతులకు ఓ పెంపుడు కుక్క ఉన్న సంగతి తెలుసు కదా! అప్పుడప్పుడూ వర్కవుట్ వీడియోలలో కనిపిస్తుంటుంది. దాన్ని తన కుమారుడిగా సమంత పేర్కొంటున్నారు. ఆ కుక్కపిల్ల దొంగతనం చేసిందట.

"ఒక తల్లిగా నేను ఫెయిల్ అయ్యాను. మా అబ్బాయి ఓ దొంగ. పక్కింటి డోర్ దగ్గరనుండి బంబి (చిన్న జింక పిల్ల బొమ్మ)ను దొంగతనం చేశాడు. ఇప్పుడు ముఖం మాడ్చుకుని మౌనంగా ఉన్నాడు" అని సమంత సరదాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్ యాక్టింగ్ కోర్సులు, అర్బన్ గార్డెనింగ్, కుకింగ్ చేస్తూ సమంత బిజీగా ఉంటున్నారు.
![]() |
![]() |