![]() |
![]() |

బాలీవుడ్ హీరోయిన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫ్ అనుష్క శర్మకు కోర్టు నుంచి మరో నోటీసు వచ్చింది. గతంలో గూర్ఖా కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయగా... ఇప్పుడు సిక్కు కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వివరాల్లోకి వెళితే... అనుష్క శర్మ నిర్మించిన వెబ్ సిరీస్ 'పాతాళ్ లోక్'. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. మెజారిటీ వీక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది. అదే సమయంలో ఈ వెబ్ సిరీస్ మీద విమర్శలు వచ్చాయి.
'పాతాళ్ లోక్' ఇప్పుడు 'లీగల్ నోటీస్ లోక్' కింద మారుతోంది. ఓ ఎపిసోడ్ లో గూర్ఖా కమ్యూనిటీని అవమానించారని, ఆ సన్నివేశాలు తొలగించడంతో పాటు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరుతూ కోర్టు నుండి ఆమెకు కొందరు నోటీసులు పంపించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ సిక్కు కమ్యూనిటీని కించపరిచేలా ఉందని పంజాబ్ హర్యానా హైకోర్టు నుండి ఇంకొకరు అనుష్కకు నోటీసులు పంపించారు. అందులో 'పాతాళ్ లోక్' మూడో ఎపిసోడ్ లో సిక్కుల మధ్య కుల కక్షలను చూపిస్తూ రెండు వర్గాలను కించపరిచే విధంగా సన్నివేశాలను చిత్రీకరించారని పిటిషనర్ పేర్కొన్నారు.
గతంలో అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే, ఢిల్లీ గురుద్వారా ప్రబంధం కమిటీ అధ్యక్షుడు మంజీందర్ సింగ్ సైతం "ప్రపంచమంతా సిక్కులు చేసే సేవలను కొనియాడుతోంది. సిక్కులు మహిళలకు రక్షణగా ఉంటారు. అటువంటివారిని అనుష్క శర్మ రేపిస్టులుగా చూపించారు. ఇది సిగ్గుచేటు" అని అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
![]() |
![]() |