![]() |
![]() |

టాలీవుడ్‌లో తండ్రీ కొడుకులు కలిసి నటించడం మనం చూస్తూనే ఉన్నాం. నందమూరి, అక్కినేని, ఘట్టమనేని, మంచు, కొణిదెల.. ఇలా కొన్ని కుటుంబాలకు చెందిన నటులు ఇలా కలిసి నటిస్తూ వస్తున్నారు. అయితే వీరందరిలోనూ నందమూరి వంశంలోని తండ్రీకొడుకులు ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి నటించినన్ని సినిమాలు మరే తండ్రీ కొడుకులు కలిసి చేయలేదు. ఆ రకంగానూ బాలకృష్ణ ఘనత సాధించారు. తండ్రితో కలిసి ఆయన 12 సినిమాల్లో కలిసి నటించారు. వీటిలో 11 సినిమాలను 1974 నుంచి 1984 వరకు పదకొండేళ్ల కాలంలో చేయడం ఇంకో విశేషం. టీనేజ్ కుర్రాడిగా ఉన్నప్పుడు 'తాతమ్మ కల' (1974)తో నటుడిగా పరిచయమైన బాలకృష్ణ.. ఆ మూవీలోనే తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి నటించాడు. చివరగా 1991లో వచ్చిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'లో తండ్రితో తెరను పంచుకున్నాడు బాలయ్య. ఇంకో విశేషమేమంటే ఈ 12 సినిమాల్లో 7 సినిమాలను తండ్రి దర్శకత్వంలోనే ఆయన నటించాడు. బహుశా.. అందుకే కాబోలు, నటనలో అప్పట్నుంచే బాలయ్య రాటుదేలుతూ వచ్చాడు.
తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి బాలకృష్ణ నటించిన చిత్రాలు
1. తాతమ్మ కల (1974)
2. అన్నదమ్ముల అనుబంధం (1975)
3. వేములవాడ భీమకవి (1976) (టైటిల్ రోల్)
4. దానవీరశూర కర్ణ (1977) (అభిమన్యుడు)
5. అక్బర్ సలీమ్ అనార్కలి (1978) (సలీమ్)
6. శ్రీమద్విరాట పర్వము (1979) (అభిమన్యుడు)
7. శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణం (1979) (నారదుడు)
8. రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980)
9. అనురాగదేవత (1982)
10. సింహం నవ్వింది (1983)
11. శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (1984) (సిద్ధయ్య)
12. బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991) (హరిశ్చంద్రుడు, దుష్యంతుడు)
![]() |
![]() |