![]() |
![]() |

తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు హరి కాంబినేషన్లో వచ్చిన 'సింగం' సిరీస్ ప్రేక్షకులను భాగా ఆకట్టుకుంది. సింగం సిరీస్ నుండి ఇప్పటివరకు వచ్చిన మూడు భాగాలకూ మంచి ఆదరణ లభించింది. అయితే ఈ సిరీస్‌లో నాలుగో భాగంగా 'సింగం 4' తెరకెక్కించడానికి రంగం సిద్దమయినట్టు తెలుస్తోంది.
సూర్య - హరి కాంబినేషన్ లో 'సింగం 4' తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. కరోనా పరిస్థితులు చక్కబడితే ఆగస్టు నుంచి షూటింగ్ కూడా మొదలుపెట్టే అవకాశముందని తెలుస్తోంది. హై ఓల్టేజీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న 'సింగం 4'.. మొదటి మూడు భాగాలకంటే భిన్నంగా భారీ యాక్షన్ ఎపిసోడ్లతో రాబోతోందంట. అలాగే 'సింగం 4'లోనూ అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాక్‌స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
కాగా, సుధ కొంగర దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'ఆకాశమే నీ హద్దురా' సినిమాతో సూపర్ హిట్ సాధించిన సూర్య.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సూర్య నటిస్తున్న మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
![]() |
![]() |