![]() |
![]() |

అత్యంత ప్రతిభావంతులైన తెలుగు నటుల్లో రావు రమేశ్ ఒకరు. నిన్నటి తరం ఉన్నత స్థాయి నటులు రావు గోపాలరావుకు సిసలైన వారసుడిగా ఆయన ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్నారు. క్యారెక్టర్ నెగటివ్ అయినా, పాజిటివ్ అయినా తన అభినయంతో ఆ పాత్రకు వన్నెతెస్తూ, సినిమాకు ఎస్సెట్ అవుతూ వస్తున్నారు. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'మహాసముద్రం'లో రావు రమేశ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు.
మంగళవారం (మే 25) ఆయన పుట్టినరోజు సందర్భంగా మహాసముద్రం మేకర్స్ ఆయన క్యారెక్టర్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 'గూని బాబ్జీ' అనే పాత్రను పోషిస్తున్నట్లు ఆ పోస్టర్‌లో తెలిపారు. ఆ పోస్టర్‌లో డార్క్ బ్రౌన్ కలర్ ప్యాంట్, దానికి మ్యాచ్ అయ్యే డిజైన్ షర్టును టక్ చేసుకొని, కుడిభుజం వైపు గూనిని చూపిస్తూ, తీక్షణంగా చూస్తూ, నడుచుకుంటూ వస్తున్నారు రమేశ్. సినిమాలో ఆయనది చాలా కీలక పాత్ర అనీ, నెగటివ్ రోల్ అనీ తెలుస్తోంది.
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తోన్న 'మహాసముద్రం'లో అదితిరావ్ హైదరి, అను ఇమ్మానియేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ మూవీ ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఇదివరకు విడుదలైన లీడ్ యాక్టర్ల లుక్స్‌కు మంచి స్పందన లభించింది. ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

![]() |
![]() |