![]() |
![]() |

జూలై 11.. మెలోడీబ్రహ్మ మణిశర్మ పుట్టినరోజు. విశేషమేమిటంటే.. ఈ ఏడాదిలో ఎన్నడూ లేని విధంగా మణిశర్మ కొత్త పాటల సందడి కనిపించింది. వరుసగా మూడు రోజుల పాటు మణి 'సింగిల్స్' సందడి చేశాయి. మూడు పాటలు కూడా మణిశర్మ అభిమానులను మురిపించేలానే ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. జూలై 9న సుధీర్ బాబు హీరోగా 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ రూపొందిస్తున్న 'శ్రీదేవి సోడా సెంటర్' నుంచి 'మందులోడా' అంటూ సాగే సింగిల్ ని రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ఈ ఫోక్ టచ్ సాంగ్.. ఇన్ స్టంట్ హిట్ నంబర్ గా నిలిచింది.
ఇక జూలై 10న 'సుప్రీమ్' హీరో సాయిధరత్ తేజ్ తో 'ప్రస్థానం' ఫేమ్ దేవ కట్టా తెరకెక్కిస్తున్న 'రిపబ్లిక్' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చింది. 'గానా ఆఫ్ రిపబ్లిక్' పేరుతో రిలీజైన ఈ పాటకి కూడా మంచి స్పందన వచ్చింది. ఇక మణి బర్త్ డే స్పెషల్ గా ఈ రోజు (జూలై 11) విడుదల చేసిన 'నారప్ప' (విక్టరీ వెంకటేశ్) ఫస్ట్ సింగిల్ కూడా అలరించేలా సాగింది. 'చలాకీ చిన్నమ్మి' అంటూ మొదలయ్యే ఈ మెలోడీసాంగ్ కూడా బాగానే ఇంప్రెస్ చేసింది.
మొత్తమ్మీద.. మెలోడీబ్రహ్మ బర్త్‌డే స్పెషల్ గా వచ్చిన మూడు పాటలు కూడా సంగీతప్రియులను ఆకట్టుకున్నాయనే చెప్పాలి. 'సింగిల్స్'తో 'తీన్ మార్' కొట్టిన మణిశర్మ.. ఆయా సినిమాల విజయంలో ఏ స్థాయిలో భాగమవుతారో చూడాలి.
![]() |
![]() |