![]() |
![]() |

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు 'నైట్రో స్టార్'గా మారిపోయాడు. 'ప్రేమ కథా చిత్రమ్', 'సమ్మోహనం', 'శ్రీదేవి సోడా సెంటర్' వంటి సినిమాలతో ఆకట్టుకున్న సుధీర్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తున్నాడు. నేడు(మే 11) సుధీర్ పుట్టిన రోజు కావడంతో ఆయన కొత్త సినిమాల పోస్టర్లు విడుదలయ్యాయి. ఆ పోస్టర్స్ లో ఆయనకు నైట్రో స్టార్ అనే బిరుదు తగిలించడం విశేషం.
మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఇప్పటికే 'సమ్మోహనం', 'v' సినిమాలలో నటించిన సుధీర్ ముచ్చటగా మూడోసారి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నైట్రో స్టార్ సుధీర్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రెట్రో లుక్ లో ఉన్న సుధీర్ కెమెరాపై చెయ్యి వాల్చి చూస్తున్న లుక్ ఆకట్టుకుంటోంది.
నటుడిగా, రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమృతం ఫేమ్ హర్షవర్ధన్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఎందుకనో విడుదల కాలేదు. అయితే ఆయన డైరెక్టర్ గా తన రెండో సినిమాని సుధీర్ తో చేస్తున్నాడు. నేడు సుధీర్ బర్త్ డే కావడంతో టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ఈ సినిమాకి 'మామా మశ్చీంద్ర' అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఇక ఫస్ట్ లుక్ లో సుధీర్ రాక్ స్టార్ లా మైక్ పట్టుకొని పాడుతూ కనిపిస్తున్నాడు.
![]() |
![]() |