![]() |
![]() |

ఛాయాగ్రాహకుడిగా ఆర్. మధిది 20 ఏళ్ళ సినీ ప్రస్థానం. కెరీర్ ఆరంభంలో మాతృభాష తమిళంలోనే సినిమాలు చేస్తూ వచ్చిన ఆర్. మధి.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన `మిర్చి` (2013)తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ తెలుగు పిక్చర్ తోనే ఇక్కడ సంచలన విజయం అందుకున్నాడు. ఆపై `రన్ రాజా రన్` (2014), `శ్రీమంతుడు` (2015), `ఘాజీ` (2017), `భాగమతి` (2018) చిత్రాలతో వరుసగా మరో నాలుగు హిట్స్ చూశాడు ఈ స్టార్ సినిమాటోగ్రాఫర్.
కాగా, `భాగమతి` తరువాత ఆర్. మధి కెమెరామేన్ గా పనిచేసిన సినిమాలు ఆశించిన విజయం సాధించలేదు. `సాహో` (2019), `రౌడీ బాయ్స్` (2022) రూపంలో తెలుగునాట తనకి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ దక్కాయి. ఈ నేపథ్యంలో.. రాబోయే `సర్కారు వారి పాట`పైనే ఆశలు పెట్టుకున్నాడు. మరి.. `శ్రీమంతుడు` తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో చేసిన ఈ చిత్రంతోనైనా.. ఆర్. మధి మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
కాగా, పరశురామ్ డైరెక్ట్ చేసిన `సర్కారు వారి పాట` ఈ నెల 12న జనం ముందుకు రానుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందించిన ఈ సినిమాలో మహేశ్ బాబుకి జోడీగా కేరళకుట్టి కీర్తి సురేశ్ నటించింది.
![]() |
![]() |