![]() |
![]() |

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇటీవలి కాలంలో తను నటిస్తోన్న మూవీస్‌తో పాటు తన వ్యక్తిగత జీవితంతోనూ హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. ఆమె రిలేషన్‌షిప్ స్టేటస్ అనేది ఎప్పుడూ ఆమె అభిమానులకు ఇష్టమైన అంశం. జాన్వీ కపూర్ సామాజిక కార్యకర్త ఓర్హాన్ అవత్రమణితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వదంతులు వచ్చాయి.
ఇటీవల, ఈ గుడ్ లక్ జెర్రీ తార తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తను ఇటీవల హాజరైన ఒక పార్టీలో క్లిక్ చేసిన కొన్ని స్టిల్స్‌ను షేర్ చేసింది. జాన్వీ తన బాయ్‌ఫ్రెండ్ ఓర్హాన్ అవత్రమణితో సన్నిహితంగా ఉన్న ఆ ఫొటోలు ఆమె ఫాన్స్, ఫాలోయర్స్ దృష్టిని ఆకర్షించాయి. ఆమె ఆ ఫొటోలను షేర్ చేయడం ఆలస్యం.. వైరల్‌గా మారాయి.
ఆ ఫొటోల్లో జాన్వీ కపూర్, ఓర్హాన్ అవత్రమణి పరస్పరం చాలా సౌకర్యవంతంగా, గాఢమైన ప్రేమలో ఉన్నవారిలా కనిపిస్తున్నారు. నియాన్ పసుపు రంగు పొట్టి దుస్తులు, దానికి మ్యాచింగ్ ఫ్లోటర్స్‌లో జాన్వీ మెరిసిపోతుండగా, ఆమె బాయ్‌ఫ్రెండ్ పసుపు ప్యాంటు, బూట్లు, నలుపు టీ-షర్ట్‌లో కనిపిస్తున్నాడు. పార్టీలో ఈ జంట జాన్వీ కపూర్ కజిన్ అయిన నటి షనయ కపూర్, వారి కామన్ ఫ్రెండ్స్‌తో కలిసి ఆహ్లాదంగా సమయాన్ని గడిపారు.
ఇటీవల జాన్వీ, ఆమె చెల్లెలు ఖుషి కపూర్ ఊటీలో హాలిడేట్ గడిపినప్పుడు, అక్కడ ఓర్హాన్ కూడా వారితో పాటు ఉన్నాడు. తాము ముగ్గురు కలిసున్న ఫొటోలను జాన్వీ షేర్ చేసినప్పుడు అవి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. అయితే ఇప్పటివరకూ తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి జాన్వీ పెదవి విప్పలేదు.
పని విషయానికి వస్తే, జాన్వీ చేతిలో పలు ఆసక్తికర ప్రాజెక్టులున్నాయి. నయనతార నటించిన తమిళ్ హిట్ ఫిల్మ్ 'కొలమావు కోకిల' హిందీ రీమేక్ 'గుడ్ లక్ జెర్రీ'లో లీడ్ రోల్ చేస్తున్న జాన్వీ, మలయాళం హిట్ ఫిల్మ్ 'హెలెన్' రీమేక్ 'మిలీ'లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే కరణ్ జోహార్ నిర్మిస్తోన్న 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' మూవీలో రాజ్‌కుమార్ రావ్ జోడీగా నటిస్తోంది జాన్వీ.

![]() |
![]() |