![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పీవీపీ బ్యానర్ తో కలిసి ఎస్వీసీ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్, కోలీవుడ్ కి చెందిన పలువురు స్టార్స్ నటిస్తుండటం విశేషం.
విజయ్ కెరీర్ లో 66వ సినిమాగా రూపొందుతోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భారీతారాగణం కనువిందు చేయనుంది. ఈ సినిమాలో శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, జయసుధ వంటి సీనియర్ యాక్టర్స్ నటిస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. దిల్ రాజు బ్యానర్ లో ప్రకాష్ రాజ్, జయసుధ నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఆ సెంటిమెంట్ ఈ సినిమాకి కూడా పనిచేస్తుందేమో చూడాలి. అలాగే ఈ సినిమాలో శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త కీలక పాత్రలలో నటిస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న సెన్సేషనల్ సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. వంశీ పైడిపల్లితో పాటు హరి,అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లేను అందించగా.. కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
![]() |
![]() |