![]() |
![]() |

మహేష్ బాబు హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' రేపు(మే 12) ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. అయితే ఈ సినిమాని ఓ నెగిటివ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్.
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలను బాగా తగ్గిస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవడంతో సినీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం జగన్ ని కలిసి సమస్యకి పరిష్కారం తీసుకొచ్చారు. జగన్ ని కలిసిన వారిలో చిరంజీవితో పాటు ప్రభాస్, మహేష్ బాబు మాత్రమే స్టార్ హీరోలు ఉన్నారు. అయితే జగన్ ని కలిసిన హీరోలను ఓ నెగిటివ్ సెంటిమెంట్ వెంటాడుతోంది.

జగన్ ని కలిసిన తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన 'రాధేశ్యామ్' విడుదలైంది. మార్చి 11న విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక చిరంజీవి హీరోగా నటించిన 'ఆచార్య' ఏప్రిల్ 29 న విడుదల కాగా టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లిస్టులో రెండో స్థానంలో నిలిచింది. దీంతో మే 12న విడుదలవుతున్న మహేష్ 'సర్కారు వారి పాట'పై కూడా ఈ సెంటిమెంట్ పనిచేస్తుందా అని ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది. అయితే కొందరు మాత్రం ట్రైలర్ బాగుందని, ఈ సెంటిమెంట్ ని 'సర్కారు వారి పాట' ఖచ్చితంగా బ్రేక్ చేస్తుందని అంటున్నారు.
![]() |
![]() |