![]() |
![]() |

మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కించే చిత్రాల్లో కథానాయకుల పాత్రలు ఎంత శక్తిమంతంగా ఉంటాయో.. ప్రతినాయకుల పాత్రలు కూడా అంతే దీటుగా ఉంటాయి. కొత్త సినిమాలోనూ ఆ పరంపరని కొనసాగించబోతున్నారట ఆయన.
ఆ వివరాల్లోకి వెళితే.. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తరువాత తన లక్కీ స్టార్ నటసింహ నందమూరి బాలకృష్ణతో బోయపాటి హ్యాట్రిక్ ఎటెంప్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. BB3 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. కాగా ఇందులో ఒక విలన్ గా సీనియర్ హీరో శ్రీకాంత్ సందడి చేయనున్నారు. అంతేకాదు.. ఇందులో ఓ పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ గా ఆయన కనిపిస్తారట. ఆ పాత్ర తాలూకూ లుక్, బాడీ లాంగ్వేజ్ చాలా ప్రత్యేకంగా ఉంటాయని ఇన్ సైడ్ సోర్స్ టాక్.
మరి.. లెజెండ్ తో జగపతి బాబు సెన్సేషన్ క్రియేట్ చేసినట్లే.. తాజా చిత్రంతో శ్రీకాంత్ కూడా సంచలనం సృష్టిస్తారేమో చూడాలి.
![]() |
![]() |