![]() |
![]() |

సూరారై పోట్రు (ఆకాశం నీ హద్దురా)తో దర్శకురాలిగా ఎన్నో మెట్లు ఎదిగారు సుధ కొంగర. ఈ నేపథ్యంలో.. సుధ తదుపరి చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రీసెంట్ గా.. ఆకాశం నీ హద్దురాని హిందీలో తానే డైరెక్ట్ చేయబోతున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే సుధ ఆలోచన మాత్రం మరోలా ఉంది.
ఈ సారి పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నారట సుధ. భారతదేశంలో చోటు చేసుకున్న కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారట ఆమె. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని టాక్. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. మరి.. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటించే కథానాయకుడు ఎవరు? సుధ టచ్ చేయబోయే ఆ ట్రూ ఇన్సిడెంట్స్ ఏంటో తెలియాలంటే మాత్రం కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |