![]() |
![]() |
.webp)
ఇటీవల విడుదలైన 'ఆర్ఆర్ఆర్'లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ ఆకట్టుకున్నాడు. బ్రిటీష్ పోలీస్ ఆఫీసర్ గా చరణ్ తన నటనతో కట్టిపడేశాడు. ఇప్పుడు 'అల్లూరి'గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించడానికి యంగ్ హీరో శ్రీ విష్ణు సిద్ధమయ్యాడు.
జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో అలరించే శ్రీ విష్ణు మరో కొత్త సినిమాని ప్రకటించాడు. అదే 'అల్లూరి'. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ప్రీ లుక్ తాజాగా రవితేజ చేతుల మీదుగా విడుదలైంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు శ్రీ విష్ణు.
.webp)
ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
ఇదిలాఉంటే చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'భళా తందనాన' సినిమాలో శ్రీ విష్ణు హీరోగా నటించాడు. రజని కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకి మణి శర్మ సంగీతం అందించారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |