![]() |
![]() |

రెండేళ్ల తర్వాత 'సర్కారు వారి పాట'తో మహేష్ బాబు థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరిగాయి. దీంతో ఈ మూవీ ఫస్ట్ డే భారీ కలెక్షన్స్ రాబట్టి నాన్-ఆర్ఆర్ఆర్ రికార్డులు సృష్టించే అవకాశముందని అంటున్నారు.
హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా 'సర్కారు వారి పాట' నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డు క్రియేట్ చేసింది. రూ.10.89 కోట్లతో ఆర్ఆర్ఆర్ మొదటి స్థానంలో ఉండగా.. రూ.7.50 కోట్లతో కేజీఎఫ్-2(6.57 కోట్లు), భీమ్లా నాయక్(6.30 కోట్లు)లను బీట్ చేసి రెండో స్థానంలో నిలిచింది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే కాకుండా ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగానూ నైజాంలో నాన్-ఆర్ఆర్ఆర్ రికార్డు సృష్టించే ఛాన్స్ ఉందని అంటున్నారు. రూ.23.35 కోట్ల షేర్ తో ఆర్ఆర్ఆర్, 11.85 కోట్ల షేర్ తో భీమ్లా నాయక్ మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. భీమ్లా నాయక్ ని బీట్ చేసి సర్కారు వారి పాట సెకండ్ ప్లేస్ లోకి వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి 'సర్కారు వారి పాట' ఫస్ట్ డే రూ.35 కోట్ల దాకా షేర్ రాబట్టే అవకాశముందట. అలాగే రెస్టాఫ్ అఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలిపి 10 కోట్ల దాకా వసూలు చేసి.. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 45 కోట్ల మేర షేర్ కలెక్ట్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు.
![]() |
![]() |