![]() |
![]() |

మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమెనే సోషల్ మీడియా వేదికగా చెప్పారు. గత వారం కరోనా బారిన పడ్డానని, ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు.
చెన్నైలో నివసిస్తున్న గ్రాండ్ పేరెంట్స్ దగ్గరకు వెళ్లాలన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా కరోనా టెస్ట్ చేయించుకోగా, పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఉపాసన చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడంతో స్వల్ప లక్షణాలే కనిపించాయని.. వైద్యులు పారాసిటమల్, విటమిన్ టాబ్లెట్స్ వాడితే సరిపోతుందని సూచించినట్లు తెలిపారు. ఈ మహమ్మారి కారణంగా నీరసం, హెయిర్ లాస్, బాడీ పెయిన్స్ వంటి సమస్యలు వస్తాయని పలువురు భయపెట్టారు.. కానీ తాను మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్ గా ఉన్నానని, ఇప్పటిదాకా ఎలాంటి సమస్యలు రాలేదని ఉపాసన చెప్పుకొచ్చారు.
కరోనా ప్రభావం దాదాపు పూర్తిగా తగ్గిపోయిందని భావిస్తున్న సమయంలో ఉపాసన కరోనా బారిన పడటం షాకింగ్ గా మారింది. అయితే ఆమె ఎలాంటి సమస్యలు లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. అలాగే కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తుందా అంటే చెప్పలేమని.. కానీ మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిదని ఉపాసన సూచించారు.
![]() |
![]() |