![]() |
![]() |

`భరత్ అనే నేను`, `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు` వంటి హ్యాట్రిక్ హిట్స్ తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు నుంచి వస్తున్న సినిమా `సర్కారు వారి పాట`. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ బిగ్ టికెట్ ఫిల్మ్.. రేపు (మే 12) తెరపైకి రాబోతోంది.
ఇదిలా ఉంటే, `సర్కారు వారి పాట`లో సీనియర్ హీరోయిన్ నదియా ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. మహేశ్ కాంబినేషన్ లో తనకి ఇది రెండో చిత్రం కావడం గమనార్హం. గతంలో నదియా ద్విపాత్రాభినయం చేసిన `బజారు రౌడి` (1988)లో మహేశ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ ఇద్దరి కాంబినేషన్.. `సర్కారు వారి పాట`లోనే రిపీట్ కాబోతోంది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. అటు `బజారు రౌడి`లోనూ, ఇటు `సర్కారు వారి పాట`లోనూ మహేశ్ బాబు స్క్రీన్ నేమ్ కూడా మహేశ్ నే. కెరీర్ మొత్తమ్మీద ఇప్పటివరకు ఈ రెండు సినిమాల్లోనే ఒరిజినల్ నేమ్ తో యాక్ట్ చేశాడు మహేశ్ బాబు. రెండింట్లోనూ నదియా నటించడం విశేషమనే చెప్పాలి. మరి.. చాలా కాలం తరువాత మహేశ్, నదియా స్క్రీన్ షేర్ చేసుకున్న `సర్కారు వారి పాట`.. బాక్సాఫీస్ ముంగిట ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
కాగా, `సర్కారు వారి పాట`లో మహేశ్ బాబుకి జోడీగా కేరళకుట్టి కీర్తి సురేశ్ దర్శనమివ్వనుంది. యువ సంగీత సంచలనం తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చాడు.
![]() |
![]() |