![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కెరీర్ లో ఇప్పటివరకు రెండు సందర్భాల్లో మాత్రమే హీరోగా హ్యాట్రిక్ హిట్స్ చూశాడు. `దూకుడు` (2011), `బిజినెస్ మేన్` (2012), `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` (2013)తో కథానాయకుడిగా ఫస్ట్ టైమ్ హ్యాట్రిక్ అందుకున్న మహేశ్ బాబు.. రీసెంట్ గా `భరత్ అనే నేను` (2018), `మహర్షి` (2019), `సరిలేరు నీకెవ్వరు` (2020)తో సెకండ్ టైమ్ హ్యాట్రిక్ కొట్టాడు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. మహేశ్ కి హ్యాట్రిక్ హిట్స్ అందించిన ఈ సినిమాలన్నింటిలోనూ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ సందడి చేశాడు.
అయితే, తొలి హ్యాట్రిక్ (దూకుడు - బిజినెస్ మేన్ - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు) అనంతరం వచ్చిన `1 నేనొక్కడినే` (2014)లో ప్రకాశ్ రాజ్ నటించలేదు. ఆ సినిమా కాస్త బాక్సాఫీస్ ముంగిట నిరాశపరిచింది. కట్ చేస్తే.. మహేశ్ రెండో హ్యాట్రిక్ (భరత్ అనే నేను - మహర్షి - సరిలేరు నీకెవ్వరు) అనంతరం వస్తున్న `సర్కారు వారి పాట`లోనూ ప్రకాశ్ రాజ్ మిస్సింగే. మరి.. `1 నేనొక్కడినే` నెగటివ్ సెంటిమెంట్ `సర్కారు వారి పాట`కీ కొనసాగుతుందా? లేదంటే సెంటిమెంట్ బ్రేక్ అయి `సర్కారు వారి పాట` విజయం సాధిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
కాగా, పరశురామ్ డైరెక్ట్ చేసిన `సర్కారు వారి పాట` రేపు (మే 12) ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.
![]() |
![]() |