![]() |
![]() |

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మూవీ మార్చి 25న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో భీమ్ పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ నటనకు ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా 'కొమురం భీముడో' సాంగ్ లో తారక్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే భీమ్ గా నటించి మెప్పించిన తారక్ గురించి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్ లో ప్రశ్న అడగటం ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్‌లో 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కొమురం భీమ్ పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రశ్న అడిగారు. ఒకవేళ మీరు ఒక ప్రముఖ ఛానల్ లో రిపోర్టర్ అయితే.. ఈ సినిమా విజయం పట్ల ఎన్టీఆర్ ని ఎలా ఇంటర్వ్యూ చేస్తారో వివరంగా రాయండని అడిగారు.

ఇంటర్ ఎగ్జామ్ లో ఎన్టీఆర్ గురించి ప్రశ్న అడగటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ క్వశ్చన్ పేపర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ నటనకు దక్కిన గౌరవం అంటూ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.
![]() |
![]() |