![]() |
![]() |
.webp)
అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya)హిట్ మూవీస్ 'ఏ మాయ చేసావే'(Ye Maaya Chesave)కూడా ఒకటి. 2010 ఫిబ్రవరి 26 న విడుదలైన ఈ మూవీ ద్వారా హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసిన సమంత,ఆ తర్వాత అనేక హిట్ సినిమాల్లో నటించి తన అద్భుతమైన నటనతో స్టార్ హీరోయిన్ హోదాని అందుకుంది.గత కొంత కాలం నుంచి వరుస పరాజయాలతో సతమవుతున్న సమంత గత ఏడాది'సిటాడెల్ హనీబన్నీ' వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా సమంత(Samantha)లేటెస్ట్ గా ఒక ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతు' ఇండస్ట్రీ లోకి ప్రవేశించే సమయంలో మార్గదర్శకులు,స్నేహితులు.బంధువులు గాని లేరు.కనీసం భాష కూడా రాదు.నా మొదటి సినిమా మాస్కో కావేరి ని నా స్నేహితుడు రాహుల్ రవీంద్రన్ తో కలిసి చేశాను.ఒక్క రోజు షూటింగ్ తోనే మూవీ ఆగిపోయింది.అంతకు మించి దాని గురించి ఏమి గుర్తులేదు.ఆ తర్వాత 'ఏ మాయ చేసావే' ఆఫర్ వచ్చింది.ఈ మూవీ నాకెంతో స్పెషల్.ప్రతి సన్నివేశం డీటెయిల్ గా ఇంకా గుర్తుంది.కార్తీక్ ని గేట్ దగ్గర కలిసే సీన్ నా ఫస్ట్ షాట్.ఈ సినిమాలోని క్యారక్టర్ ఇచ్చి న సంతృప్తి వేరే సినిమాల్లోని క్యారక్టర్ లు పెద్దగా ఇవ్వలేదని చెప్పుకొచ్చింది.
సమంత చెప్పిన ఈ మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.'ఏ మాయ చేసావు' లో కార్తీక్, జెస్సి గా నాగ చైతన్య,సమంత తమ క్యారెక్టర్స్ లో అత్యద్భుతంగా నటించారు.ఈ మూవీ సమయంలోనే ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు.ఆ తర్వాత పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకొని తమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

![]() |
![]() |