![]() |
![]() |

విక్టరీ వెంకటేష్(Venkatesh)అనిల్ రావిపూడి(Anil ravipudi)దిల్ రాజు(Dil Raju)ఐశ్వర్య రాజేష్(Aiswarya Rajesh)మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhary)కాంబోలో సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki vasthunnam).ఎవరు ఊహించని విధంగా సంక్రాంతి విన్నర్ గా నిలవడమే కాకుండా,మూడు దశాబ్దాల వెంకటేష్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా కూడా 'సంక్రాంతికి వస్తున్నాం' అవతరించింది.300 కోట్ల రూపాయిలు వసులు చేసిందంటే ఏ స్థాయి హిట్ ని అందుకుందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ మూవీ మార్చి 4 వ తారీకుతో 92 సెంటర్స్ లో 50 రోజులని పూర్తి చేసుకొని అరుదైన ఘనతని సాధించింది.ఈ విషయాన్నీ చిత్ర బృందం అధికారకంగా ప్రకటిస్తు'చిన్న సినిమాకి అసాధ్యం అనుకున్న అంచనాలని మా సినిమా అలవోకగా అందుకుంది.మూవీపై మొదటి నుంచి వెంకటేష్, అనిల్ కి ఉన్న నమ్మకమే ఇంత పెద్ద విజయానికి కారణమని వెల్లడి చేసింది.
రీసెంట్ గా ఓటిటి వేదికగా జీ 5 ద్వారా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం, అద్భుతమైన ప్రేక్షకాదరణతో టాప్ లో కొనసాగుతుంధి.12 గంటల్లో 13 లక్షల మంది వీక్షించారని ఆర్ ఆర్ ఆర్ హనుమాన్ రికార్డులని క్రాస్ చేసిందని సంస్థ అధికారంగా తెలిపింది.

![]() |
![]() |