![]() |
![]() |

నందమూరి కళ్యాణ్ రామ్ తన 21వ సినిమాని ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. #NKR21 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది. అశోక క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. #NKR21 షూటింగ్ చివరి దశలో ఉంది. మూవీ అవుట్ పుట్ అదిరిపోయేలా వస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇక ఈ సినిమాకి పవర్ ఫుల్ టైటిల్ ని లాక్ చేసినట్లు తెలుస్తోంది.
'NKR21' సినిమాకి 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. టైటిల్ ని బట్టి చూస్తే.. వైజయంతిగా విజయశాంతి, అర్జున్ గా కళ్యాణ్ రామ్ తల్లీకొడుకుల పాత్రల్లో కనిపిస్తారని అర్థమవుతోంది. ఇప్పటికే 'NKR21' నుంచి వైజయంతి ఐపీఎస్ గా విజయశాంతి లుక్ రివీల్ అయ్యి ఆకట్టుకుంది. అప్పట్లో 'కర్తవ్యం' సినిమాలో వైజయంతి ఐపీఎస్ గా విజయశాంతి పవర్ ఫుల్ పర్ఫామెన్స్ ను అంత తేలికగా మరచిపోలేము. ఇప్పుడు 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'లోనూ అదే రేంజ్ లో ఉండబోతుందని టాక్. ముఖ్యంగా కళ్యాణ్ రామ్-విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ అని అంటున్నారు.
![]() |
![]() |