![]() |
![]() |

కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న మాస్ మహారాజా రవితేజ 'మాస్ జాతర' సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. భాను బోగవరపు దర్శకత్వంలో సితార ఎంటెర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'మాస్ జాతర' తర్వాత సితార బ్యానర్ లోనే 'మ్యాడ్' ఫేమ్ కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో రవితేజ ఒక సినిమా చేయనున్నాడని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా మరో ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. (Ravi Teja)
రవితేజ తన తదుపరి సినిమాని కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయనున్నాడట. ఈ సినిమాకి 'అనార్కలి' అనే టైటిల్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. 'అనార్కలి' టైటిల్ ను బట్టి చూస్తే, ఇందులో రవితేజ 'సలీం'గా కనిపిస్తాడేమో అనిపిస్తోంది. అంతేకాదు, ఈ సినిమాని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం.
'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ', 'చిత్రలహరి' వంటి సినిమాలతో దర్శకుడిగా కిషోర్ తిరుమల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సినిమాలలో కామెడీ, ఎమోషన్స్, మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. చివరిగా 2022 లో 'ఆడవాళ్లు మీకు జోహార్లు'తో ప్రేక్షకులకు పలకరించాడు కిషోర్ తిరుమల. కానీ, ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. మరి ఇప్పుడు రవితేజతో చేయనున్న 'అనార్కలి'తో మళ్ళీ తన మార్క్ చూపిస్తాడేమో చూడాలి.
![]() |
![]() |