![]() |
![]() |
.webp)
ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు,నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)గత ప్రభుత్వ హయాంలో కులాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడటంతో పాటుగా,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఐటి శాఖ మినిస్టర్ లోకేష్(Lokesh)పై అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన విషయం తెలిసిందే.ఈ విషయంపై పోసాని పై ఏపి వ్యాప్తంగా 30 కి పైగా ఫిర్యాదులు అందడంతో పాటు 14 ఏరియాలకి చెందిన పోలీసు స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి.
దీంతో కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పోలీసులు పోసాని ని హైదరాబాద్(Hyderabad)లో అరెస్ట్ చేసి రాజంపేట(Ramjampeta)కోర్టులో హాజరుపరచడంతో కోర్టు రిమాండ్ విధించింది. నరసరావుపేట(Narasaraopeta)బాపట్ల(Bapatla)అనంతపురం,యాదమర్రి,పుత్తూరు, విజయవాడ(VIjayawada)పాలకొండ, పాత పట్నం పోలీసులు కూడా పోసాని పై పిటి వారెంట్లు సిద్ధం చేస్తున్నారు.ఇప్పటికే మూడు జిల్లాలకి చెందిన పోలీసులు రాజంపేట జైలు అధికారులకి పిటి వారెంట్లు అందచేశారు. కోర్టు అనుమతి తీసుకున్నామని పోసాని ని ముందు మాకంటే మాకు అప్పచెప్పాలని పోటీపడుతున్నారు.
దీంతో రాజంపేట జైలు అధికారులు ముందు ఎవరకి ఇవ్వాలో తెలియక,ఉన్నతాధికారుల సూచనతో,నిబంధలని పరిశీలించిన అనంతరం నరసరావుపేట పోలీసులకి అప్పచెప్పారు. ఈ విధంగా పోసాని ఎప్పుడు ఏ పోలీసు స్టేషన్ కి వేళ్తాడో తెలియని పరిస్థితి.పోసాని బెయిల్, కస్టడీ పిటిషన్లని కడప మొబైల్ కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
![]() |
![]() |