![]() |
![]() |

కరోనా మహమ్మారి కారణంగా చాలా కాలం నుండి థియేటర్లు మూతపడి ఉన్నాయి. అక్టోబర్ 15 నుండి అవి మళ్లీ తెరుచుకుంటున్నాయి. థియేటర్లు మూసివేయడం వల్ల పలు సినిమాల విడుదల తేదీ మీద ఎఫెక్ట్ పడింది. ఈ కారణంగా చాలా చిత్రాల రిలీజ్ డేట్‌ను పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు థియేటర్లు పునఃప్రారంభం కానున్నాయి. ఈ థియేటర్లు ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్‌తో ప్రారంభమవుతుండటం గమనార్హం. అవును, గత ఏడాది మే నెలలో విడుదలైన 'పిఎం నరేంద్ర మోడీ' చిత్రం మరోసారి విడుదల కానుంది.
నటుడు వివేక్ ఒబెరాయ్ టైటిల్ రోల్ చేసిన 'పిఎం నరేంద్ర మోడీ' మూవీ ఏడాది తర్వాత మళ్లీ విడుదలవుతోంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. 'లాక్డౌన్ తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న మొదటి చిత్రం' అని అందులో పేర్కొన్నారు. అక్టోబర్ 15న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
దేశంలోని అత్యుత్తమ సెట్ డిజైనర్లలో ఒకరైన ఓముంగ్ కుమార్ ఇదివరకు 'మేరీ కామ్', 'సరబ్జిత్' వంటి సినిమాలను రూపొందించిన తర్వాత తీసిన చిత్రం 'పిఎం నరేంద్ర మోడీ'. ఈ చిత్రంలో నరేంద్ర మోడీ మోడీ రాజకీయాల్లోకి వచ్చిన కథ, అంటే విద్యార్థి జీవితం నుండి గుజరాత్ ముఖ్యమంత్రి కావడం, తరువాత దేశ ప్రధాని కావడం వంటివి చూపించారు. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ తొమ్మిది విభిన్న రూపాల్లో కనిపిస్తారు.

![]() |
![]() |