![]() |
![]() |

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలిసి తొలిసారిగా ఓ పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం విజయ్ దేవరకొండ కఠినమైన శిక్షణ తీసుకుంటూ, చెమట్లు చిందిస్తున్నారు. 'ఫిల్మ్ కంపానియన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మూవీ గురించి ఆయన తన అభిప్రాయం షేర్ చేసుకున్నారు.
"ఈ సినిమాలోని రోల్ కోసం గత ఎనిమిది నెలలుగా నేను వర్కవుట్స్ చేస్తున్నాను. ఈమధ్య నేను మోటివేషన్ కోల్పోయాను. కానీ తర్వాత నన్ను నేను మోటివేట్ చేసుకొని, నాన్‌స్టాప్‌గా ప్రతిరోజూ వర్కవుట్ చేస్తూ వస్తున్నాను. మూవీలో నేను ఒక ఫైటర్ రోల్ చేస్తున్నా. సిక్స్ ప్యాక్ కానీ, ఎయిట్ ప్యాక్ కానీ, ఎవరినైనా కొట్టగల ఫైటర్‌లా నేను కనిపించాలి." అని చెప్పారు విజయ్.
'ఫైటర్' తన ఫస్ట్ కమర్షియల్ మాస్ సినిమా కావడంతో దాని గురించి మాట్లాడుతూ, "ఇది నా తరహా కమర్షియల్ సినిమాగా తయారవుతోంది. మామూలుగా మనం చూసే, చూస్తూ పెరిగిన రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదు. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు, కమర్షియల్ జానర్‌లోకి వచ్చే ఇలాంటి సినిమానే చెయ్యాలనుకున్నాను. కమర్షియల్ సెన్సిబిలిటీస్‌కు పేరుపొందిన పూరి జగన్నాథ్ డైరెక్టర్ కావడం వల్ల ఈ ఫిల్మ్‌కు మరింత కమర్షియల్ మద్దతు లభించింది" అని ఆయన తెలిపారు.
డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుతూ, "ఆయన నా ఫేవరేట్ డైరెక్టర్. ఆయన తీసిన వాటిలో 'పోకిరి' నా ఫేవరేట్ ఫిల్మ్. అన్నారు విజయ్.
అతి త్వరలో షూటింగ్ పునఃప్రారంభం కానున్న ఈ చిత్రంతో బాలీవుడ్ తార అనన్యా పాండే (నటుడు చంకీ పాండే కుమార్తె) టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమవుతుండగా, చార్మీ కౌర్, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ ఫిల్మ్‌ను నిర్మిస్తున్నారు.
.jpg)
![]() |
![]() |