![]() |
![]() |

`ఖిలాడి` తరువాత మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న చిత్రం `రామారావు ఆన్ డ్యూటీ`. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రవితేజ సరసన రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నారు. సామ్ సి.ఎస్. సంగీతమందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. జూన్ 17న విడుదలకు సిద్ధమైంది.
కట్ చేస్తే.. అదే రోజున మరో ఆసక్తికరమైన సినిమా రాబోతోంది. ఆ చిత్రమే.. `గాడ్సే`. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాని గోపీగణేశ్ డైరెక్ట్ చేశాడు.`బ్లఫ్ మాస్టర్` (2018) తరువాత సత్యదేవ్, గోపీగణేశ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి నాయికగా నటించింది. సునీల్ కశ్యప్ సంగీతమందించాడు. కాగా, యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాని తొలుత మే 20న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఇప్పుడు జూన్ 17కి వాయిదా వేశారు. దీంతో.. రవితేజ `రామారావు ఆన్ డ్యూటీ`కి పోటీగా సత్యదేవ్ `గాడ్సే` వస్తున్నట్లయ్యింది. మరి.. ఒకే రోజున రిలీజ్ కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్స్ లో ప్రేక్షకులు దేనిని ఆదరిస్తారో చూడాలి.
![]() |
![]() |