![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్' మూవీలో రామరాజు పాత్రలో నటించి మెప్పించాడు రామ్ చరణ్. ఈ మూవీలో చరణ్ నటనకు ప్రశంసలు వ్యక్తం కావడమే కాకుండా.. మూవీ భారీ కలెక్షన్స్ తో సంచలనం సృష్టిస్తోంది. ఇక ఇప్పుడు చరణ్ తదుపరి సినిమాలపై ప్రేక్షకుల దృష్టి నెలకొంది. చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన 'ఆచార్య'లో కీలక పాత్రలో నటించిన చరణ్ ఏప్రిల్ 29 న ప్రేక్షకులను పలకరించనున్నాడు. అలాగే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేస్తున్నాడు. చరణ్ హీరోగా నటిస్తున్న 15 వ సినిమా ఇది. తాజాగా ఈ సినిమా నుంచి చరణ్ లుక్ లీక్ అయింది.
'ఆర్ఆర్ఆర్' విడుదలకి ముందే #RC15 కొంతభాగం షూటింగ్ జరుపుకుంది. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి. కలెక్టర్ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగే పాత్ర ఒకటి కాగా, మరొకటి పల్లెటూరి యువకుడి పాత్ర అని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి చరణ్ పాత్రకి సంబంధించిన ఫోటో ఒకటి లీక్ అయింది. పంచెకట్టులో సైకిల్ మీద కూర్చొని ఉన్న చరణ్ లుక్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
'రంగస్థలం'లో చిట్టిబాబుగా, 'ఆర్ఆర్ఆర్' రామరాజుగా నటించి మెప్పించిన చరణ్.. 'RC15'తో మరోసారి ఆకట్టుకోవడం ఖాయమని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |