![]() |
![]() |

దర్శకుడు క్రిష్ జాగర్లమూడిది మామూలు తెలివి కాదు. నిర్మాతకు ఖర్చు మిగులుస్తూ... చిత్రీకరణ చేయగల మహా మేథావి. మెగా మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్‌తో క్రిష్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ చేస్తున్నారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు కొన్ని సినిమా షెడ్యూళ్లు వాయిదా పడ్డాయి. రవితేజ ‘క్రాక్’ చిత్రీకరణను ఇండోర్‌లో సెట్స్ వేసి చేస్తున్నారు. క్రిష్ అండ్ కో మాత్రం వర్షంలోనూ ఆగలేదు.
ఈ సినిమాలో కథాపరంగా కొన్ని సన్నివేశాలను వర్షంలో చిత్రీకరించాలట. అందుకోసం రెయిన్ ఎఫెక్ట్ కృత్రిమంగా సృష్టించకుండా... సహజంగా కురుస్తున్న వర్షాల్లో తీసేస్తున్నారు. క్రిష్ తెలివే తెలివి కదూ!
త్వరగా పంజా వైష్ణవ్‌తేజ్ సినిమా పూర్తి చేసి, ఆ తరువాత పవన్ కల్యాణ్ సినిమా పనులను మళ్లీ ప్రారంభించాలనేది క్రిష్ ప్లాన్. ‘వకీల్ సాబ్’ చిత్రీకరణను పవన్ పూర్తిచేసే లోపు, ఆయన మేనల్లుడి సినిమా చిత్రీకరణ పూర్తి కానుంది. అదీ సంగతి. ఈలోపు అందులో కథానాయికను సైతం ఎంపిక చేయాలి. పవన్ సినిమాలో జాక్వలైన్ ఫెర్నాండేజ్ ఓ హీరోయిన్. మరో హీరోయిన్‌ని సెలెక్ట్ చేయాలట.
![]() |
![]() |