![]() |
![]() |

‘రాధే శ్యామ్’ మ్యూజిక్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ‘డియర్ కామ్రేడ్’కి మ్యూజిక్ అందించిన జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నాడు. తమిళంలో కొన్ని సినిమాలు చేసిన అతడికి ప్రభాస్ సినిమా రావడం గొప్ప అనే చెప్పుకోవాలి. అయితే, సౌతిండియన్ లాగ్వేంజెస్‌కి మాత్రమే జస్టిన్‌ని తీసుకున్నారు. హిందీకి సపరేట్ మ్యూజిక్ డైరెక్టర్‌ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసింది.
ప్రభాస్ లాస్ట్ సినిమా ‘సాహో’ మ్యూజిక్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా లేరు. దాంట్లో పాటలను వివిధ మ్యూజిక్ డైరెక్టర్ల చేత చేయించారు. అవి డబ్బింగ్ పాటలు వలే ఉన్నాయని కామెంట్స్ వినిపించాయి. అందుకని, సౌతిండియాకి సపరేట్‌గా... నార్త్ ఇండియాకి సపరేట్‌గా సాంగ్స్ చేయించాలని అనుకుంటున్నారు. హిందీ మ్యూజిక్ డైరెక్టర్‌ని త్వరలో ఫిక్స్ చేయనున్నారు. ప్రస్తుతానికి అతడు ఎవరనేది సస్పెన్స్‌లో ఉంచారు. రీరికార్డింగ్ మాత్రం ఒక్కరే చేసే అవకాశాలు ఉన్నాయి.
![]() |
![]() |