![]() |
![]() |

'మహానటి'తో తెలుగునాట కీర్తీ సురేష్ కీర్తి అమాంతం పెరిగింది. అయితే... ఆ తరువాత ఆమె నటించిన సినిమాలు ఏవి అంతగా విజయం సాధించలేదు. ఆ మాటకొస్తే మహానటి తరువాత కీర్తి నటించిన స్ట్రయిట్ తెలుగు చిత్రాలేవీ విడుదల కాలేదు. మూడు సినిమాలు చేసినా... ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. వచ్చిన డబ్బింగ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇటువంటి సమయంలో కీర్తికి మహేష్ నిర్మాతలు భారీ పారితోషికం ఇస్తున్నారని వస్తున్న వార్తలు ఘట్టమనేని అభిమానులు సహా ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట'లో కథానాయికగా నటించే అవకాశాన్ని కీర్తీ సురేష్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆమె కోటిన్నర రెమ్యునరేషన్ తీసుకుంటోందట. వరుస ఫ్లాపులు వచ్చినప్పటికీ 'మహానటి' క్రేజ్ చూపించి గ్యాస్ చేసుకుంటోందట. పూజా హెగ్డే తర్వాత అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికగా కీర్తి నిలుస్తుంది ఏమో!
![]() |
![]() |