![]() |
![]() |

బాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్‌కు ఆగస్ట్‌లో లంగ్ కేన్సర్ ఉన్నదనే విషయం వెల్లడైంది. అప్పట్నుంచీ అందుతున్న ట్రీట్‌మెంట్‌కు ఆయన బాగా కోలుకున్నాడు. ముంబైలో సంజయ్‌కు ట్రీట్‌మెంట్ జరుగుతోందనీ, ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమేణా మెరుగవుతోందనీ ఆయన ఫ్యామిలీ మెంబర్ ఒకరు పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు.
"సంజయ్ ఆరు నెల్లో, లేక ఈ ఒక్క నెలో బతుకుతాడు అంటూ వస్తున్న న్యూస్ తరహా సీన్ అస్సలు లేదు. ఆయన ఒక రకమైన లంగ్ కేన్సర్‌కు గురయ్యాడని పరీక్షల్లో వెల్లడైంది. ముంబైలో చికిత్స తీసుకుంంటూ, దానికి బాగా కోలుకున్నాడు. సోమవారం టెస్ట్ చేయించుకోవడానికి వెళ్లాడు. రిజల్ట్స్ చాలా బాగున్నాయి. దేవుడి దయ, అందరి ఆశీర్వాదాల వల్ల ఆయన బాగా కోలుకున్నాడు" అని ఆ ఫ్యామిలీ మెంబర్ చెప్పారు.
తనకు కేన్సర్ సోకిన తర్వాత పోయిన వారం తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తన పరిస్థితి గురించి తొలిసారి మాట్లాడాడు సంజయ్. అందులో షేర్ చేసిన వీడియోలో "నా లైఫ్‌లో ఇది ఇటీవలి గాయపు మచ్చ. కానీ దాన్ని నేను ఓడిస్తాను. త్వరలోనే ఈ కేన్సర్ నుంచి బయటపడతాను" అని చెప్పాడు. ఆ వీడియోలో స్పైక్డ్ హెయిర్ లుక్, స్టైలిష్ బియర్డ్‌తో కనిపించాడు. 'కేజీఎఫ్:' చాప్టర్ 2'లో చేస్తున్న అధీర క్యారెక్టర్ కోసం ఆ లుక్‌లోకి వచ్చాడు సంజయ్.
![]() |
![]() |