![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మార్చి 25 న విడుదలై భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్ల గ్రాస్ కి చేరువైంది. అయితే ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ తో సంచలనాలు సృష్టిస్తున్నప్పటికీ కొందరు ఈ సినిమా పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ పాత్రతో పోల్చితే తారక్ పాత్ర అంత బలంగా లేదని.. కేవలం తన నటనతోనే తారక్ ఆ పాత్రను నిలబెట్టాడని అంటున్నారు. ఈ సినిమా వల్ల తారక్ కి పెద్దగా ఒరిగిందేమీ లేదని, చరణ్ కే బాగా ప్లస్ అయిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే చరణ్ మాత్రం తామిద్దరం సమానమే అని అంటున్నాడు.
తాజాగా ముంబైలో ఆర్ఆర్ఆర్ 1000 కోట్ల సక్సెస్ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన సమయంలో ఆర్ఆర్ఆర్ ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. తారక్ కన్నా చరణ్ ఎక్కువ మార్కులు కొట్టేశాడు.. చరణ్ కే ఎక్కువ ప్రశంసలు దక్కుతున్నాయని ఓ జర్నలిస్ట్ అనగా దానిని చరణ్ ఖండించాడు.
"నేను ఈ మాటతో ఏకీభవించను. ఒక్క క్షణం కూడా అలా ఆలోచించను. మేమిద్దరం చాలా బాగా చేశాం. తారక్ అద్భుతంగా నటించాడు. నేను ఈ సినిమాను ఆస్వాదించినంతగా ఇప్పటిదాకా ఏ సినిమానూ ఆస్వాదించలేదు. ఈ సినిమా వల్ల నేను పొందిన అత్యుత్తమమైన విషయం.. తారక్ తో నా ప్రయాణం. దీన్ని నేనెప్పటికీ మరిచిపోలేను. ఈ అవకాశం కల్పించిన రాజమౌళి గారికి ధన్యవాదాలు" అంటూ చరణ్ చెప్పిన మాటలు ఆకట్టుకున్నాయి.
![]() |
![]() |