![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి త్వరలో `ఆచార్య`గా ఎంటర్టైన్ చేయనున్నారు. తన తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చిరు నటించిన ఈ సోషల్ డ్రామా.. వేసవి కానుకగా ఏప్రిల్ 29న జనం ముందుకు రానుంది. విజనరీ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన ఈ సినిమాలో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో కనిపించబోతున్నారు మెగాస్టార్.
ఇదిలా ఉంటే, `ఆచార్య` విడుదలైన నాలుగు నెలల్లోపే తన నెక్స్ట్ వెంచర్ తో పలకరించేందుకు ప్లాన్ చేస్తున్నారట ఈ కొణిదెల స్టార్. ఆ వివరాల్లోకి వెళితే.. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ `లూసీఫర్`ని తెలుగులో `గాడ్ ఫాదర్` పేరుతో చిరు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. `హనుమాన్ జంక్షన్` ఫేమ్ మోహన రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఇప్పటివరకు దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుందని సమాచారం. కాగా, కుదిరితే ఆగస్టు 11న లేదంటే మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ గా ఆగస్టు 22న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, `గాడ్ ఫాదర్`లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుండగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్ర పోషిస్తోంది. యువ సంగీత సంచలనం తమన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి బాణీలు అందిస్తున్నాడు.
![]() |
![]() |